తేది: 27- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : 26 జనవరి సోమవారం రోజు కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల దివ్యాంగుల భవనంలో దివ్యాంగుల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం టి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, అలాగే ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగుల కమిటీ నాయకులు జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింగారావ్ కి కృతజ్ఞతలు తెలిపి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల డివిజన్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు ఇల్లుటపు నాగరాజు,కోరుట్ల పట్టణ అధ్యక్షులు చెట్ పల్లి ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు సదుల మనోజ్, కోరుట్ల మండల అధ్యక్షులు కట్కం గణేష్, ఉపాధ్యక్షులు మారంపల్లి భూమయ్య, కథలాపూర్ మండల అధ్యక్షులు గూగులోత్ రవి నాయక్,ఉపాధ్యక్షులు కొప్పుల భూమయ్య, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కార్యవర్గ సభ్యులు సాయి నిఖిల్,సాయి, శేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.