రిమినీ స్ట్రీట్ సహకారంతో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు 50 ల్యాప్‌టాప్‌ల పంపిణీ.

తేది: 27-01-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

హైదరాబాద్ : తెలంగాణ లోక్ భవన్‌లో రిమినీ స్ట్రీట్ కంపెనీ స్పాన్సర్ చేసిన 50 ల్యాప్‌టాప్‌లను గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అక్షయ విద్య ఫౌండర్ & వైస్ ప్రెసిడెంట్ టెంటు వర ప్రసాద్ గారు, ట్రస్టీ జనార్దన్ , చైర్మన్ జై వివేక్ ఆనంద్ గారు, రిమినీ స్ట్రీట్ ఎండీ నారాయణ మూర్తి మల్లవరపు తో పాటు డోనార్స్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, విద్యార్థులకు డిజిటల్ వనరులు అందించడం వారి భవిష్యత్‌కు కీలకమైన అంశమని తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యారంగ అభివృద్ధికి బలాన్నిస్తాయని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అక్షయ విద్య ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *