తేది:27- 01- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
హైద్రాబాద్: హిమాయత్ నగర్ లోని ఎస్ ఎం ఈ వాసవి గ్రాండ్ శ్రీముఖి కాంప్లెక్స్ లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ ఇండియా ఐకానిక్ అవార్డు–2026ను అందుకోవడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని సన్నిధి నీలిమా రాణి తెలిపారు. విద్యా రంగంలో ఆమె అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయడం తన జీవితంలో ఒక మరిచిపోలేని ఘట్టమని అన్నారు.ఈ అవార్డు తన వ్యక్తిగత విజయమే కాకుండా, తనకు మార్గదర్శకులుగా నిలిచిన ఉపాధ్యాయులు, సహచరులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహానికి ప్రతిఫలంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరంతర కృషి, అంకితభావం మరియు సేవా దృక్పథంతో ముందుకు సాగితే ఇలాంటి గుర్తింపులు లభిస్తాయని ఈ అవార్డు తనకు మరింత ప్రేరణనిస్తోందని తెలిపారు.
ప్రత్యేకంగా విద్యా రంగంలో నాణ్యమైన బోధన, విలువలతో కూడిన విద్య, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను గుర్తించినందుకు అవార్డు కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రయాణంలో తనను ఎల్లప్పుడూ ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సహకారం లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు. భవిష్యత్తులో కూడా మరింత అంకితభావంతో సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని ఈ అవార్డు మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు.మీ అమూల్యమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.