తేది:27-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీమతి రాణి కుముదిని గారు అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఎన్నికల నియమావళి కఠినంగా అమలు, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్, అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీ మరియు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు సూచించారు.