తేది:27-01-2026 TSLAWNEWS ఇంచార్జ్ విజయ్ మురళి కృష్ణ.
హైదరాబాద్ : మనమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో హిమాయత్ నగర్ లోని ఎస్ ఎం ఈ వాసవి గ్రాండ్ శ్రీముఖి కాంప్లెక్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నితి ఆయోగ్, భారత ప్రభుత్వ అనుమతి పొందిన మనమ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని “స్వర్ణిమ్ భారత్ – విరాసత్ ఔర్ వికాస్ అనే అంశంతో నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సమాజానికి సేవలందించిన ప్రముఖులు, కళాకారులు, విద్యార్థులు, చిన్నారులకు సత్కారాలు, అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకలకు సైబర్ సురక్ష సోల్జర్ డా. పారువెల్లి అంకా విజయ దుర్గ భవాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా క్యాలెండర్లు, ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేయడం జరిగింది. ఆమె లైఫ్, హెల్త్ అండ్ జెనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ప్రముఖ పత్రిక జర్నలిస్టు గా, హ్యూమన్ రైట్స్ & కన్స్యూమర్ రైట్స్ ఉమెన్స్ వింగ్ సభ్యురాలు, అలాగే శ్రీ వారాహి వెల్త్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్గా సేవలందిస్తున్నారు.
డా. దుర్గ భవాని సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ మోసాలు, సైబర్ ఫ్రాడ్లు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు సైబర్ నేరాలకు బలికాకుండా జాగ్రత్తలు తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. సైబర్ నేరాల బాధితులకు సరైన సూచనలు, సహాయం అందిస్తూ సమాజంలో భద్రతా చైతన్యాన్ని పెంచుతున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలను గుర్తు చేసే రోజు అని, దేశ అభివృద్ధితో పాటు ప్రతి పౌరుడు సైబర్ సురక్షపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. సురక్షితమైన డిజిటల్ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.