తేది:27- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మరియు రాష్ట్ర DGP బి. శివధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ లు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు కావున అధికారులు మరియు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ఎన్నికలు స్వేచ్చా మరియు పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడుతూ:
రెండవ సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్లు, ఎస్పీలు మరియు అధికార యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయితీ ఎన్నికల లాగే రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు స్వేచ్చా మరియు పారదర్శకంగా నిర్వహించే విధంగా అన్నిరకాల చర్యలు తీసుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని మొత్తం అధికార యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉంచాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర DGP బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు. అలాగే పట్టణ కేంద్రాల్లో జరిగే ఎన్నికలు కావున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకోవాలని 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే అటవీ, ఎక్సైజ్ శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నట్లు వీటికి మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అలాగే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను మరొకసారి వెరిఫై చేయాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని అధికారులందరు ఎన్నికల నియమావళి సక్రమంగా పాటించాలని తెలిపారు. మొదట 24,48 మరియు 72 గంటల రిపోర్టులు వెనువెంటనే పంపాలని తెలిపారు. జగిత్యాల జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో మాన్‌పవర్ మేనేజ్‌మెంట్, శిక్షణ, బ్యాలట్ బాక్సులు, రవాణా, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఖర్చుల పర్యవేక్షణ, మీడియా, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారం, నివేదికలు, మైక్రో ఆబ్జర్వర్లు తదితర కీలక అంశాలకు జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నియమితులైన నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి , ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.