తేది: 22-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని,GWMC 60వ డివిజన్ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో, వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాల నుండి సుబేదారి వరకు పాఠశాల విద్యార్థులు మరియు ఎన్.సి.సి క్యాడెట్లతో 77 మీటర్ల జాతీయ పతాకాంతో “భారీ తిరంగ ర్యాలీ” ఘనంగా నిర్వహించి, మండల్ ఆఫీస్ జంక్షన్ వద్ద జాతీయ గీతాలాపనతో పాటు వందేమాతరం గీతాన్ని కూడా ఆలపించి, దేశభక్తిని ఘనంగా చాటారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం మన దేశానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలు మరియు స్వేచ్ఛ విలువలను ప్రతి భారతీయుడికి గుర్తు చేసే గొప్ప పర్వదినమని పేర్కొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారు విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి మరియు సామాజిక బాధ్యతతో ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూ, ఐక్యత మరియు సమైక్యతతో భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పింగిలి డిగ్రీ కళాశాల ఎన్.సి.సి విద్యార్థులు, వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వడ్డేపల్లి గ్రామస్తులు, 60వ డివిజన్ వాసులు, డివిజన్ బీజేపీ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.