పంటి నొప్పి, జ్వరం, రక్తస్రావం, మహిళల్లో పీరియడ్స్ పెయిన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి వాడే పెయిన్ కిల్లర్ ‘మెఫ్తాల్’పై కేంద్రం డ్రగ్ సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (IPC) ప్రతికూల ప్రభావాల కోసం ఔషధాన్ని పర్యవేక్షించాలని ఆరోగ్య నిపుణులకు సలహా ఇస్తుంది.