తేది:26-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా : మెదక్ జిల్లా ఫోటో మరియు వీడియో గ్రఫీ వెల్ఫేర్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఫోటో మరియు వీడియో గ్రఫీ అధ్యక్షుడు కంచి ఆనంద్, ప్రధాన కార్యదర్శి బండ చంద్రశేఖర్, కోశాధికారి కూచన శ్రీధర్ మరియు క్రికెట్ టోర్నమెంట్ 2026 ను మెదక్ పట్టణంలో ని సి యస్ ఐ కాంపౌండ్ లోని కేసీఆర్ గ్రౌండ్ లో ఆదివారం మరియు స్పోర్ట్స్ కమిటీ సభ్యులు దాసరి శ్రీధర్, బొద్దుల విగ్నేష్, వంశీకృష్ణ, ఎం లక్ష్మణ్, నరేందర్ గౌడ్, డి శ్రీకాంత్, అవారి సుమన్, జి రవి, బోయిన శ్రీకాంత్,సమక్షంలో సోమవారం మరియు ఆదివారం రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా, హోరా హోరిగా జరిగింది.ఈ టోర్నమెంట్ కు జిల్లాలోని మెదక్ మండల్, చిన్న శంకరంపేట్, చేగుంట, తూప్రాన్,రామాయంపేట్,అల్లదుర్గ్, వెల్దుర్తి, వివిధ మండలాలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ మెదక్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి లు టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభిచారు. హోరాహోరీ గా జరిగిన టోర్నమెంట్లో ఫైనల్ కు అల్లాదుర్గం మరియు శంకరంపేట్ లు తలపడగా అల్లాదుర్గం టీం మొదటి విజేతగా నిలిచింది. రన్నర్ అప్ గా చిన్న శంకరంపేట్ లు నిలిచాయి. ఈటోర్నమెంట్ లో గెలుపొందిన టీం కు మొదటి బహుమతి గా 12వేల రూపాయలను, విన్నర్ కప్ ను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి ద్వారా అందించారు. రెండవ బహుమతి కి 6 వేల రూపాయలును రన్నర్ అప్ కప్ ను అందించారు.ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్ రెడ్డి,రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి,ప్రధాన సలహాదారుడు శ్రీధర్ బాబు, జాయింట్ సెక్రటరీ జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి దాసరి శ్రీధర్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్,మాజీ కౌన్సిలర్ గొదల సాయిలు, జీ ఆర్ మెమోరియల్ చైర్మన్ నరేష్ బాబు,సి యస్ ఐ కాంపౌండ్ కోశాధికారి సంపత్,మెదక్ మండల అధ్యక్షులు సురేందర్ కార్యదర్శి హరీష్ కోశాధికారి ఈగ శ్రీకాంత్,సీనియర్ ఫోటో గ్రాఫర్స్ మరియు వివిధ మండల ఫోటోగ్రాఫర్ లు తదితరులు పాల్గొన్నారు.