మంబోజిపల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం. ఘనంగా కొయ్యగుట్ట మల్లన్న బండ్లు.

తేది:26-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండల రిపోర్టర్ శివలింగం యెల్లం.

మెదక్ జిల్లా: మెదక్ మండలం మంబోజిపల్లి శివారులోని కొయ్య గుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి కి ఘనంగా బండ్లు తిరిగాయి . మల్లికార్జున స్వామి కళ్యాణం వంశపారపర్య ఆలయ అర్చకులు మల్లన్న ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతియేటా మాఘ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.తొలి రోజు ఉదయం దిష్టికుంభం, ఆలయసంప్రోక్షన, అఖండజ్యోతి ప్రజ్వలన, బ్రహ్మకలశ స్థాపన, గణపతిపూజ, నవగ్రహపూజ, స్వామివారికి రుద్రాభిషేకము, సహస్రబిల్వార్చన, మద్యాహ్నం మల్లిఖార్జున స్వామి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. . ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మేకల రాములు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న జాతర వేడుకలు నిర్వహించారు. పక్కనున్న పల్లెలు ప్రజలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *