తేది:26-01-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా : వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 294 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైల్, స్పోర్ట్ స్టేడియం, సీసీ రోడ్డు& డ్రైనేజ్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ సమాచార రెవిన్యూ, గృహ నిర్మాణాల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య గారు, గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.అనంతరం ఐనవోలు మండల పరిధిలోని లింగమేరిగూడెం సర్పంచ్ దామెర యాకన్న వార్డు మెంబర్ పెసరు రాజమ్మ నీరటి ఎల్లయ్య మరియు వర్ధన్నపేట టౌన్ 7వ, 8వ వార్డు నుంచి బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ నుంచి 50 మందిని మాజీ కౌన్సిలర్ పాలకుర్తి సుజాత సారంగపాణి మరియు పాలకుర్తి శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాగరాజు.అదే విధంగా మీడియా మిత్రులు పక్కా ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి గారికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల సంక్షేమాన్ని విస్మరించలేదని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు సన్న బియ్యం, అర్హులకు కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
పేద విద్యార్థుల కోసం హాస్టల్ డైట్ చార్జీలను 40 శాతం పెంచడంతో పాటు విద్యార్థినులకు కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచామని, విద్యా–వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్నారు.
ఇల్లు లేని పేదల కోసం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 20 వేల ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు వెచ్చించి, ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరుచేశామని, వర్ధన్నపేట నియోజకవర్గానికి కూడా లబ్ధి చేకూరిందని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా ఏప్రిల్‌లో రెండో విడతలో కూడా పార్టీ లకతీతంగా ఇళ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, టిపిసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు
సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల డివిజన్ , గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.