తేది : 26-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణతంత్ర వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ తుకారం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడు తూ భారతదేశానికి స్వాతంత్రం అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అప్పటినుండి భారత్ గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్యామ్ రావు, రవికుమార్, నరసింహారెడ్డి ,రవీందర్ శివకుమార్ ,శంకర్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.