
తేది:26-1-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్ చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: నల్గొండ మండలం ఎం. దోమలపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో గ్రామ సర్పంచి ఏళ్ల శిల్ప సతీష్ రెడ్డి, గారు మరియు స్కూల్ హెడ్ మాస్టర్ కొమ్ము శ్రీనివాస్, గారు అలాగే ఉప సర్పంచ్ గాదె సురేష్, గారు గ్రామ పెద్దలు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది స్కూల్ టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహంగా గ్రామ సర్పంచ్ గారు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన వారికి ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు ,రెండవ బహుమతిగా 5000 రూపాయలు, ఇస్తానని తెలుపుతూ నలగొండ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ మార్కులు రావాలని తెలిపారు అలాగే స్కూల్ హెడ్మాస్టర్ గారు కొమ్ము శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాజ్యాంగం లో ఉన్నటువంటి నిధులు ఎంత ముఖ్యమో విధులు కూడా అంతే ముఖ్యమని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులు గాని పోలీస్, డాక్టర్స్, లాయర్స్ , కలెక్టర్లు,కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతినిధులు విధులను ప్రతి ఒక్కరు కూడా చట్టంగా న్యాయపరంగా విధులని నిర్వహించాలని ప్రతి ఒక్క భారతీయుడు అదేవిధంగా ఆలోచించాలని అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పోరాడి తెచ్చుకున్న హక్కులను అమలు చేసుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు అదే విధంగా స్కూల్ విద్యాపకులు మరియు విద్యార్థులు దేశ స్వతంత్ర సమరయోధులను వీరులను కొనియాడారు దేశ భక్తి చాటారు ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కొమ్ము శ్రీనివాస్ గారు గ్రామ సర్పంచ్ ఏళ్ల శిల్ప సతీష్ రెడ్డి మరియు TSLAW న్యూస్ నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి గారు విద్యాపకులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.