తేది:26-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులతో పాటు విధులను కూడా గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలకు కట్టుబడి, నిజాయితీతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రతి బాధితుడికి న్యాయం అందేలా పోలీసు వ్యవస్థ నిరంతరం కృషి చేయాలని, చట్ట పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. బాధ్యతాయుత పౌరులుగా జీవిస్తూ సమాజంలో శాంతి, భద్రతలు నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.