తేది:26-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా పెంబట్ల కోనాపూర్ రిపోర్టర్ సిగిరి రాజిరెడ్డి.
జగిత్యాల జిల్లా : సారంగాపూర్ మండలంలో ఉన్న దుబ్బ రాజేశ్వర దేవస్థానం ముందు భాగంలో ఉన్న రాజగోపురంకు గ్రానైట్ వేసి పూర్తి చేయడానికి గుల్లపేట గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ముందుకు వచ్చి పూర్తి చేస్తానని చెప్పి ఈరోజు రాజగోపురంకు సంబంధించిన పనులు ప్రారంభం చేయమని లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి ఈవో అనుష ఘనంగా సన్మానించారు. ఈవో అనుష మాట్లాడుతూ 27 – 01 – 2026 రోజున దుబ్బ రాజేశ్వర జాతరకు సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగు యున్నది అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని పత్రిక ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పంగకిష్టయ్య, పుణ్యం పిన్నెం సత్యం, బానుక రాజవ్వ, మాజీ ఎంపీపీ కోల శ్రీనివాస్, కొంగరి లింగారెడ్డి, మధుకర్ రావు, బొడ్డుపల్లి రాజన్న, సీనియర్ అసిస్టెంట్ రజనీకాంత్, పూజారులు సాగర్, చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.