జగిత్యాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ – పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

తేది:26- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, రాష్ట్ర శోభ సంతరించుకుని నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్‌ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, NCC పరేడ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం గురించి క్షుణ్ణంగా వివరించారు.
జిల్లాలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పౌరసేవలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర విభాగాల్లో సాధించిన పురోగతి పై ఆయన విభాగాల వారీగా ఉపన్యాసించారు.
వ్యవసాయ రంగంలో రైతులకు మద్దతు ధరలు, పంట బీమా, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సేవా కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్–రబీ సీజన్లలో పంటల విస్తీర్ణం పెరిగినట్టు వివరించారు. మార్కెట్ యార్డుల్లో MSP చెల్లింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు.
ఆరోగ్యరంగంలో జిల్లాలో PHC, CHC, మాతృశిశు ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు సమర్థవంతంగా సాగుతున్నాయని తెలిపారు.
విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల పెంపు, డిజిటల్ బోధన, లైబ్రరీలు మరియు లాబ్‌ల ఏర్పాటుతో విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మెరుగుపడినట్టు వివరించారు. బాలికల విద్య ప్రోత్సహానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, CC రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, త్రాగునీటి సరఫరా వంటి పౌరసేవలు అమలు అవుతున్నాయని తెలియజేశారు. పట్టణాభివృద్ధిలో రోడ్లు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ట్యాంకుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు అమలు అవుతున్నాయని వివరించారు.
విధుల్లో ప్రతిభ కనబరిచిన వివిధ ఆయా శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు మరియు బహుమతులు అందజేశారు. “ప్రతి ఉద్యోగి విధి నిర్వహణ అంటే పవిత్ర బాధ్యత. ప్రజా సేవ అంటే నమ్మకం నిలబెట్టడం” అంటూ పేర్కొన్నారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించి అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలన్నారు.
పోలీస్, రెవెన్యూ, విద్య, ఆరోగ్య, MEPMA, గ్రామపంచాయితీలు,DRDA, ICDS మరియు ఇతర శాఖలు అవార్డులు అందుకున్నాయి.ప్రభుత్వ శాఖల స్టాళ్లు ప్రధాన ఆకర్షణ వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా, పిల్లల దివ్యాoగుల వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ( మెప్మా ), తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బి. సి మైనార్టీ సంక్షేమ శాఖ, జగిత్యాల జిల్లా పోలీస్ మరియు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. సంక్షేమ, ఆరోగ్యం, పింఛన్లు, వ్యవసాయం, విద్య, పౌరసరఫరాల పథకాల అమలు వివరాలు, గణాంకాలు, ఫోటో డాక్యుమెంట్స్ ప్రదర్శించబడగా జిల్లా కలెక్టర్ స్టాళ్లను సందర్శించి శాఖల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు.
ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులుమరియు ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, కలెక్టరేట్ ఏ.వో షాదబ్ హకిమ్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, సమబంధిత కార్యాలయాల సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *