తేది:26-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్.
వరంగల్ జిల్లా: ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మనం 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, మనకంటూ ఒక సొంత చట్టం, ఒక రాజ్యాంగం ఏర్పడింది మాత్రం 1950 జనవరి 26న. ఆ రోజునే మన దేశం పూర్తిస్థాయి ‘గణతంత్ర రాజ్యంగా’ అవతరించింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజును మనం ఎంతో గర్వంగా జరుపుకుంటాం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించబడిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు.. కోట్లాది భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయానికి సజీవ సాక్ష్యం. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం మన రాజ్యాంగం.
గణతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు. బాధ్యతలు కూడా! దేశాభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయి. నేటి యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తూ, అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలి. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు, దేశానికి వెన్నెముకైన రైతులకు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేసిన వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు &తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు శ్రీ కొండేటి శ్రీధర్ గారు వారితో జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, డా. కంభంపాటి పుల్లారావు, బాకం హరీష్ శంకర్, బన్న ప్రభాకర్, మల్లాడి తిరుపతి రెడ్డి, వన్నాల వెంకటరమణ, రాయపురంపు కుమారస్వామి, మాదాసు రాజు, మార్టిన్ లూథెర్, మొండేటి మహేందర్,తదితరులు పాల్గొన్నారు.