తేది:25-01-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
హైదరాబాదు: హిమాయత్ నగర్ లోని ఎస్.ఎం.ఇ వాసవి గ్రాండ్ శ్రీముఖి కాంప్లెక్స్ లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీ జె అబ్దుల్ కలాం సేవా రత్న అవార్డు తీసుకున్న డ్రాగన్స్ కుంగ్- ఫు గ్రాండ్ మాస్టర్ కొండిల సదానందం, టి జి ఓదెల మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థినిలు, రామినేని స్రవంతి,చింతం శ్రీవల్లి,కురిమిండ్ల కలిక, బుస ఆశ్రిత,నాంసంపల్లి, ఎంపియుపిఎస్ కు చెందినఈరవేని కృషిత, కాల్వ శ్రీరాంపురం మండల్ క్రిసెంట్ హై స్కూల్ కు చెందిన పెంకుల కృష్ణప్రియ,పెగడపల్లి సన్ షైన్ లర్నింగ్ స్కూల్ కు చెందిన బుధారపు లాస్విక, బుర్ర తరుణ్ శ్రీలు,వీరికి అవార్డు కోసం సహకరించినటువంటి హైదరాబాద్ కి చెందిన దుర్గా భవాని కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ రేలంగి నరసింహ రావు, జెన్నీ సీనియర్( నటుడు యమలీల సినిమా) అలాగే మనం ఫౌండేషన్ ఫౌండర్ డా కె చక్రవర్తి పాల్గొన్నారు. పిల్లలు చేసిన విన్యాసాలు చాలా చక్కగా ఉన్నాయి అని వారికి ఆశీర్వాదం తెలిపారు. ఆడ పిల్లలు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈ కుంగ్ – ఫు యుద్ధ విద్య చాలా సహాయ పడుతుంది అని వీరికి శిక్షణ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ సదానందం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.