కళ్యాణ లక్ష్మి పేదింటి ప్రజలకు వరం- మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్.

తేది:25-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని ఆయన అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్, సీనియర్ నాయకులు మ్యాకల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *