తేది:25-01-2026 హన్మకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రోజున గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కె.ఆర్. నాగరాజు గారు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఐనవోలు మండల పరిధిలోని 57 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 57, లక్షల 06 వేల 612 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు లబ్ధిదారులకు అందజేశారు.పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలు పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆడబిడ్డల భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వము అందిస్తున్న సహాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు తమ పిల్లల వివాహాలను గౌరవప్రదంగానిర్వహించుకోవాలని సూచించారు. అర్హులైన ఒక్కరూ సంక్షేమ పథకాల నుంచి వంచితులుగా ఉండకూడదనే ఉద్దేశంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలనుసమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు పూర్తి బాధ్యతతో కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే నాగరాజు గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోలేపల్లి శివశంకర్ రెడ్డి, సర్పంచ్ జెట్టబోయిన రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు యాంకర్ సాంబయ్య, కాంగ్రెస్ నాయకులు మధు గౌడ్, సత్తిరెడ్డి, మార్నేని లక్ష్మణరావు, పెండ్ల సంపత్, రాజిరెడ్డి, తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.