ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్ కు ఇండియన్ ఐకాన్ అవార్డు. తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ సేవా సంస్థ వారు ప్రధానం చేశారు. ఇండియన్ ఐకాన్ అవార్డు ప్రముఖుల చేతుల మీదగా హనుమకొండ ప్రెస్ క్లబ్లో అందజేశారు.ఆందోల్ మండలం తాలేల్మా గ్రామానికి చెందిన ఉమ్మన్నగారి కృష్ణా గౌడ్.

తేది:25- 01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి మున్సిపాలిటీ, పరిధిలోని శాంతినగర్, స్థానిక విద్యా సంస్థ సెయింట్ ఆంథోనీ విద్యాసంస్థలో తెలుగు భాషోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్ కు స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ జయంతోత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో “ఇండియన్ ఐకాన్ అవార్డు” వరంగల్ హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు అందజేశారు. కవి గేయ రచయిత గా సాహిత్య రంగంలో సామాజిక అంశాలపై రచనలు చేస్తూ, వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు. సాహిత్యం లో విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా అవార్డు ప్రధానం చేశారు. ఉమ్మన్నగారి కృష్ణా గౌడ్ ఆందోల్ మండలం తాలేల్మా గ్రామానికి చెందిన కవి గేయ రచయిత, తెలుగు భాష పై మమకారంతో కవితలు పాటలు రాస్తూ ప్రముఖుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని అందించిన తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *