తేది:25-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్.
సంగారెడ్డి జిల్లా: ఈ రోజు ఉదయం 10 గంటలకు గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్
(” గోపా “)సంగారెడ్డి జిల్లాలో గోపా సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం నూతన కార్యవర్గ ఎంపిక ప్రమాణ స్వీకారోత్సవం.
ఈ కార్యక్రమానికి సార ప్రభాకర్ గౌడ్ సభాధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ” గోపా “రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో ఉన్న వారంతా ఉన్నత చదువులు చదవాలని చదువుకున్న ప్రతి ఒక్కరికి జీవనోపాధి అవకాశాలను అందించడానికి సూచనలు ఇవ్వడానికి ” గోపా ” అవకాశాలను వివరిస్తూ, సహాకరిస్తూ, తోడ్పాటు అందిస్తుందని వివరించారు.
” గోపా ” లో సభ్యులు గా చేరిన ప్రతీ సభ్యునికి ” సుప్రజా హాస్పిటల్ నాగోల్ హైదరాబాద్ ” వారి సహకారంతో 30% డిస్కౌంట్ తో కూడిన హెల్త్ కార్డ్ సౌకర్యం కూడా కల్పిస్తుందని వివరించారు.
ఇంకా రాబోయే కాలంలో భవన నిర్మాణం చేపట్టబోతున్నామని, తద్వారా గౌడ్ లకు సంబంధించిన ప్రతి అంశాన్ని సేకరించి తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఉపాధ్యక్షులు చెక్కిళ్ళ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ:
సర్టిఫికెట్లలో పేరు చివర గౌడ్ అని లేనప్పటికీ పేరు తెలియజేస్తున్నప్పుడు,పేరు చివర గౌడ్ అని తెలియచేయాలని, తద్వారా వివిధ శాఖలలో పని చేస్తున్న మన వారు మనకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తూ సహాకరిస్తారని, అలాగే అన్ని రకాల సర్వీసులు, సేవలు మనవారి ద్వారా నే ఉపయోగించుకోవాలని తద్వారా ఐక్యత అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయని తెలియజేయడం జరిగినది. మరొక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యల్మకంటి మీరయ్య గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ నాటి సమావేశంలో జిల్లా సభ్యుల సమక్షంలో ఎన్నికైన నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ ప్రకటించడం జరిగినది.ఈ నాటి నూతన కమిటీ సభ్యులలో ముఖ్యంగా ఎన్నికైన వారు ముఖ్య సలహాదారునిగా, పూసల లింగా గౌడ్, జిల్లా అధ్యక్షులుగా సార ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ కే రాజు గౌడ్, కోశాధికారిగా శంకరి వెంకట్ స్వామి గౌడ్, ఉపాధ్యక్షులు గా, రాం చందర్ గౌడ్, రాములు గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా చెన్న గౌడ్, సంయుక్త కార్యదర్శి గా విట్టల్ గౌడ్ లను ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగినది.