తేది:25-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తాసిల్దార్ మల్లయ్య అన్నారు. జాతీయ ఓటు హక్కు దినోత్సవం సందర్భంగా అల్లాదుర్గంలోని కస్తూర్బా పాఠశాల నుండి స్థానిక బస్టాండ్ లోని గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీతో చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది, శక్తివంతమైనదని అందువల్ల ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో భాగస్వాములై దేశానికి మంచి నాయకత్వాన్ని అందించేందుకు తోడ్పాటు అందించాలన్నారు. ఓటుతో ప్రభుత్వాలు తారుమారు అవుతాయని, శక్తివంతమైన మీ ఓటు వజ్రాయుధం అని ఏ ఒక్కరు అవకాశాన్ని వదులుకో రాదని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మహేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ వరలక్ష్మి, ఆర్ ఐ లు స్వర్ణలత, ఫెరోజ్, జూనియర్ అసిస్టెంట్ స్వాతి, జి పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.