తేది:25-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కంది మండల్ రిపోర్టర్ గుడ్డోల్ల మల్లేశం.
సంగారెడ్డి జిల్లా: కంది మండల్ ఎర్ధనూర్, బ్యాతోల్ గ్రామ శివారు నక్క వాగులో ఇసుక ఫిల్టర్ ల దంద జోరుగా సాగుతుంది అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలిపెడుతున్నారు. పెద్ద పెద్ద హిటాచిల సహాయంతో నక్క వాగులో నుంచి మట్టిని తీసి కృత్రిమ ఇసుక తయారు చేయుచున్నారు ఒకరోజు పదుల సంఖ్యలో ఇసుక లారీలు నింపుతున్నారు. అదేవిధంగా అసైన్మెంట్ భూములలో నుంచి మట్టిని తీసి ఇట్టుక బట్టీలకు తరలిస్తున్నారు అధికారులకు మాత్రం అన్ని తెలిసి కూడ మాకేమి సంబంధం లేదు అన్నటుగా వ్యవహరిస్తున్నారన్ని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలా చేస్తున్న వారి పైన కట్టిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.