తేది:25-01-2026 కరీంనగర్ జిల్లా TSLAWNEWS కోఆర్డినేటర్ బియ్యాల కృష్ణ.
కరీంనగర్ జిల్లా: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ పాఠాలకు ప్రహారీ గోడల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తేది:24-01-2026 శనివారం బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్, రేగులపల్లి, గుండారం, గూడెం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహారీ గోడల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేయడమే కాకుండా పలు గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ పాఠశాలలకు ప్రహారీ గోడలు రక్షణ కవచాలు పని చేస్తాయన్నారు. ప్రహరీ గోడ నిర్మాణంతో పాఠశాలకు భద్రత మరింత పెరుగుతుందని, విద్యార్థులు అనవసరంగా బయటకు వెళ్లకుండా పాఠశాల పరిధిలోనే ఉండగలుగుతారని చెప్పారు. అలాగే కుక్కల బెడద తగ్గడంతో పాటు బయటి వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చన్నారు. అంతే కాకుండా పాఠశాల ప్రశాంతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో నూతనంగా వేయించిన బోర్ ను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడికి వచ్చే భక్తులు నీటి సౌకర్యం కల్పించేందుకు బోరు వేయించడం జరిగిందన్నారు. అంతే కాకుండా గుడి ప్రాంగణంలో చెట్లు, పూల మొక్కల పెంపకం కోసం నీటిని అందించే వీలుకలుగుతుందన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వీవో భవనాలకు భూమిపూజ బెజ్జంకి క్రాస్ రోడ్ , పోతారం,గూడెం గ్రామాల్లో మహిళా సంఘ భవనాల (వీవో) నిర్మాణం పనులకు శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతబూ మహిళా సంఘాలకు సొంత భవనాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అందులో భాగంగానే బెజ్జంకి క్రాస్ రోడ్, పోతారం,గూడెం గ్రామాల్లో వీవో భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆయన వివరించారు.
సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ బెజ్జంకి మండలం రేగులపల్లి, గూడెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రహదారులు నిర్మించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నదని ఆయన చెప్పారు.
పోతారం లో గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే హాజరు
బెజ్జంకి మండలం పోతారం గ్రామంలో శనివారం జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించి గృహప్రవేశాలు జరిపించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు తెలిపారు. రెండో విడుత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేపట్టక ముందే నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన లబ్ధిదారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, ఎఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బైర సంతోష్, గూడెల్లి శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, పులి సంతోష్ , సాదిక్ తదితరులు పాల్గొన్నారు.