తేది:24-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS
వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, రాబోయే పురపాలక ఎన్నికల్లో పార్టీని ఘన విజయం దిశగా నడిపేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు.ఎన్నికల సన్నాహకాల్లో ఎలాంటి అలసత్వం లేకుండా, బాధ్యతతో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వరద రాజేశ్వర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మాజీ వార్డు మెంబెర్స్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.