ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోటలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూగజీవమైన ఆవు దూడపై కొంతమంది ఆకతాయిలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే గోమాత సంతతిపై ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మరియు గో ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోరానికి పాల్పడిన వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితులు ఆవు దూడను ఊరి శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, దానిపై పైశాచికంగా అఘాయిత్యం చేశారు. అంతటితో ఆగకుండా, ఈ నీచమైన ఉదంతాన్ని తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు బయటకు రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. గోమాతను దేవతగా పూజించే దేశంలో ఇలాంటి అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. జంతు హింస మరియు ప్రకృతి విరుద్ధమైన నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.