తేది:24- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి
జగిత్యాల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డా.సుజాత
జగిత్యాల జిల్లా :జగిత్యాల పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులను, ల్యాబ్ లను జిల్లా వైద్యాధికారి డా.సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది, రిజిస్ట్రేషన్ లో నమోదైన సిబ్బంది పోల్చి చూశారు. రిజిస్ట్రేషన్ లో ఉన్న అర్హత గల సిబ్బంది మాత్రమే ఆసుపత్రిలో పనిచేయాలని, ఒకవేళ సిబ్బంది ఎవరైనా మారినచో వెంటనే అనుమతి పొందిన తర్వాత మాత్రమే వారిని పనిలోకి తీసుకోవాలని,ఆస్పత్రులు ల్యాబ్ వ్యర్ధాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే నిర్మూలించాలని, ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ వాహనాలకు ఇవ్వరాదని,ఆస్పత్రి స్థాపన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఒకవేళ నిబంధన ఉల్లంగించిచో,ఆసుపత్రి పై వెంటనే కఠిన చర్యలు తీసుకోబడతాయని, ఆసుపత్రి అనుమతి రద్దు చేయబడుతుంది అని జిల్లా వైద్యాధికారి డా.సుజాత
ఈ సందర్భంగా తెలియజేశారు.