తేది: 24- 01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణం కేంద్రం లో రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమo లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టర్ సత్య ప్రసాద్, డిఎస్పి రఘు చందర్ తో కలిసి Arrive Alive పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ చేపడుతున్న “Arrive Alive” కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమని అన్నారు.చిన్న చిన్న తప్పిదాలు, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల కారణాలతో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, వాటితో కలిగే ఇబ్బందుల పై రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, వాటితో కలిగే ఇబ్బందుల పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో “Arrive Alive కార్యక్రమాని పోలీస్ శాఖ నిర్వహిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా అవుతున్నాయని వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ ఒక పోలీస్ శాఖ వారి బాధ్యత కాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని రోడ్లపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.