పెద్ది సినిమా వాయిదా పడునుందా..?

గత కొద్ది రోజులగా.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా వాయిదా పడుతుంది అనే వార్త వినిపిస్తూనే ఉంది. అనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి 27న సినిమా విడుదల అని అధికారికంగా ప్రకటించారు. కానీ కొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, మే 1న కొత్త రిలీజ్ డేట్ అంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

 

ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సమయానికి దగ్గరగా విడుదల కావాల్సి ఉండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటివరకు సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో లేరట. మొదట ప్రకటించిన తేదీకే సినిమాను తీసుకురావాలని పూర్తి ప్లానింగ్‌తో ఉన్నారని తెలుస్తోంది.

 

అయితే ఒక చిన్న చర్చ మాత్రం యూనిట్‌లో జరుగుతోంది. మార్చి 19న ధురంధర్ 2, టాక్సిక్ వంటి భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాలకు మంచి బజ్ ఉంది. దీంతో అక్కడ థియేటర్లు దొరకడం పెడ్డికి కాస్త కష్టంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. పెద్ది సినిమా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తయింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సంతృప్తి చెందిన బుచ్చిబాబు, సెకండ్ హాఫ్ పనులు మొదలుపెట్టారు. ఆయన గతంలో తెరకెక్కించిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై నమ్మకం పెరిగింది.

 

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ దీనికి ఉదాహరణ. ఫస్ట్ హాఫ్ ఎడిట్‌ను రెహమాన్‌కు పంపించారని, త్వరలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

 

కాబట్టి సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా.. పెద్ది సినిమా ప్రస్తుతం అనుకున్న ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోంది. అధికారికంగా వాయిదా అనే మాట మాత్రం ఇప్పటివరకు ఎక్కడా వినిపించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *