తేది:23-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండలం రిపోర్టర్ మహమ్మద్ బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: కల్లూరు మండలం లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న కల్లూరు 108 సిబ్బంది Emt ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పర్వత రవి, వాహన చోదకుడు పైలెట్ కటారి ప్రభాకర్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బైక్ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాకు చెందిన కొమ్ము సాయి.మహేష్ 35. గట్టు రాంబాబు 19 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం వైపు వెళుతుండగా అతివేగంతో రైలింగును ఢీకొనడం జరిగిందని స్థానికులు తెలిపారు. తలకు బలమైన గాయాలైనాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే పైకి సకాలంలో చేరుకున్న కల్లూరు మంజూరు సిబ్బందిని ఖమ్మం జిల్లా 108 సర్వీస్ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దిన్ 108 సిబ్బందిని అభినందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.