తేది:23-01-2026 TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ రాకేష్ బొంతల.
వరంగల్ జిల్లా: ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రం లోని బీజేపీ కార్యాలయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు & తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు శ్రీ కొండేటి శ్రీధర్ మాట్లాడుతు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త శక్తివంతంగా మరియు శక్తివంతన లేకుండా పనిచేయాలి, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా ఒక వీరుడిలా ప్రతి వార్డులో ప్రతి వీదీ లో ప్రతి ఇంటికి గడపగడపకు తిరిగి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓటర్లకు తెలియజేయాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలను, మోసలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి, కష్టపడి పక్క ప్రణాళికతో క్షేత్రస్థాయిలో ముందుండి నడపాలని పార్టీ కార్యకర్తలను కోరారు, అట్టడుగు స్థాయి నుంచి భూత్ స్థాయి వరకు ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని,రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గతానికి మించిన ఉత్సాహంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను,గ్రామ అభివృద్ధిని, ఉపాధి అవకాశాలు, పీఎం సడక్ యువజన వంటి పథకాలు ప్రయోజనాలు ప్రజలకు చేరవేయాలని సూచించారు. అనంతరం పోటీ చేసే అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు వనాల శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మేయర్ డాక్టర్ టి రాజేశ్వరరావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ్ నాయక్, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మ రావు,బివారితో వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు వంగాల సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్, నర్సంపేట ఎమ్మెల్యే కాంటెస్టెంట్ కంభంపాటి పుల్లారావు, కన్వినర్, కో కన్వినర్ లు ముత్తిరెడ్డి కేశవరెడ్డి, మళ్ళది తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు కొండేటి అనిత సత్యం, మహిళా నాయకురాలు మంజుల రెడ్డి, వర్దన్నపేట ఎన్నికల ప్రభారీ గుజ్జుల సత్యనారాయణ,ఎన్నికల కన్వినర్ మైస రాము, మున్సిపల్ ఎన్నికల ప్రభారీ జిల్లా కార్యదర్శి రాయపురం కుమారస్వామి, జిల్లా నాయకులు గాడిపెల్లి రాజేశ్వర్ రావు, మాజీ వైస్ జడ్పీ చైర్మన్ గజ్జెల శ్రీరాములు,అలాగే నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.