తేది:23- 01-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: స్వామి వివేకానంద జయంతి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సత్కరించారు. ఈ ఏడాది మొత్తం భారతదేశం నలుమూలల కొంత మంది ప్రముఖులను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా సహకార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, రాజకీయ వ్యూహకర్త మరియు విశ్లేషకుడు అయిన ఆఫ్తాబ్ అహ్మద్ ని శాలువా మరియు జ్ఞాపిక (మెమెంటో) అందజేసి ఘనంగా సత్కరించారు.
సమాజానికి, యువతకు దిశానిర్దేశం చేసే విధంగా ఆఫ్తాబ్ అహ్మద్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మేధావులు, సామాజిక నాయకులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.