తేది:23- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: అడిషనల్ కలెక్టరు రెవెన్యూ బి.ఎస్.లత శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా భూ భారతి ఆపరేటర్స్ తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ:
భూ భారతి ద్వారా భూ రికార్డుల సక్రమ నిర్వహణకి ప్రజలకు కలిగే లబ్ధిపై అధికారులకు అవగాహన కల్పించారు.
ల్యాండ్ యూజ్ అప్‌డేట్స్, మార్పిడి, భూస్వామ్యం సంబంధిత వివరాల ఎంట్రీ వేగవంతం చేయాలని సూచించారు.
స్లాట్ బుకింగ్ వ్యవస్థ ద్వారా సేవలు పారదర్శకంగా అందించాలని జోరుగా ఆదేశించారు.
మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సిస్టమ్ లోపాలు, సాంకేతిక అడ్డంకులను వెంటనే సంబంధిత విభాగాలకు తెలియజేయాలని సూచించారు.
ముఖ్యంగా రైతులకు సంబంధించిన భూ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని వెల్లడించారు.
స్లాట్ బుకింగ్ పై ప్రజల అవగాహన పెంచేందుకు సమాచారం ప్రచారం అవసరమని తెలిపారు.
సిబ్బంది శిక్షణ, టెక్నికల్ సపోర్ట్, మానిటరింగ్ బలోపేతం చేయాలని ఆదేశించారు.
పాలనా వ్యవస్థలో పారదర్శకత పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అధికారులు ప్రజాభ్యర్థనలను ఆలస్యం చేయకుండా సమయానికి పరిష్కరించాలని కోరారు.