తేది:23-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా,మెదక్ మండల పరిధిలోని పేరూరు మంజీరా నది తీరాన వెలసిన సరస్వతీ మాత 24వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో వసంత పంచమి వేడుకలు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు దోర్భల రాజ మౌళిశర్మ,అర్చకులు దొర్భల మహేష్ శర్మలు అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు చేసి, ఆమ్మవారిని విశేషాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఓడిబియ్యాలు, కుంకుమార్చనలు,చిన్నారులకు అక్షరాభ్యాసం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం పరిసరాల్లో శకట బ్రహ్మణోత్సవం బండ్లు తిరుగుట కన్నుల పండువగా జరుగుతున్నాయి.వసంత పంచమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ సిబ్బంది సామూహిక అక్షరాభ్యాసం చేయించేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు.భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.