స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ యుద్ద విమానాలు.. కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి..

ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న తేజస్ యుద్ధవిమానాల కొనుగోలుకు పలు దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ఈక్రమంలో ఈ యుద్ధవిమానాలను కొనేందుకు ఫిలిప్పీన్స్, నైజీరియా, అర్జెంటీనా, ఈజిప్టు దేశాలు ముందుకొస్తున్నాయని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ సీబీ అనంతకృష్ణన్ బుధవారం తెలిపారు. ఈ విషయమై ఆ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *