
తేది:23-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా : జాతీయ వ్యవసాయ మార్కెట్ (NAM) పరిధిలోని మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు (23-01-2026) పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కొబ్బరికాయ కొట్టి పసుపు కొనుగోళ్లను ప్రారంభించారు. మార్కెట్‌కు మొత్తం 86 క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు రాగా. పసుపు కాడి రకం 40 క్వింటాళ్లు , కనిష్ట ధర క్వింటాల్‌కు రూ.9,166, గరిష్ట ధర రూ.14,511గా నమోదైంది. మోడల్ ధర రూ.11,599గా ఉంది. పసుపు గోళ రకం 37 క్వింటాళ్లు. ఈ రకానికి కనిష్ట ధర రూ.9,111, గరిష్ట ధర రూ.13,911గా ఉండగా, మోడల్ ధర రూ.11,111గా నమోదైంది. పసుపు చూర రకం 10 క్వింటాళ్లు. కనిష్ట ధర రూ.9,266, గరిష్ట ధర రూ.12,666గా ఉండగా, మోడల్ ధర రూ.10,717గా నమోదైంది.మొత్తంగా మెట్ పల్లి మార్కెట్‌లో 86 క్వింటాళ్ల పసుపుకు లావాదేవీలు జరిగాయి.
ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, మార్కెట్ అధికారులు, వ్యాపారస్తులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.