కొండగట్టులో ఆలయం ముందు అర్చకుల నిరసన.

తేది:23-01-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట శుక్రవారం అర్చకులు బైటాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వారు ఆలయం ఎదుట బైటాయించారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఒకేసారి గుంపులుగా ఆలయంలోకి ప్రవేశించడంతో ఈవో అర్చకులను మందలించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారి మధ్య వివాదం తలెత్తడంతో అర్చకులు ఆలయం ఎదుట బైటయించి ఈవో దౌర్జన్యం నశించాలి అని, అర్చకులకు తగిన గౌరవం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు చేసి ఈవో పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *