తేది:22-01-2026 నల్లగొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
నల్గొండ జిల్లా: యునైటెడ్ క్రిస్టియన్ సర్వీస్ సొసైటీ అనుబంధ విభాగమైన క్రిస్టియన్ పాస్టర్ సొసైటీ కొండమల్లేపల్లి మండల నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో మండలంలోని సుమారు 30 చర్చిల పాస్టర్ల సమక్షంలో నిర్వహించినారు. ఈ సమావేశంలో, అందరి ఆమోదంతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పాస్టర్స్ సంఘం అధ్యక్షుడిగా యేకుల సామేలు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, గౌరవ అధ్యక్షుడిగా కోనేరు ప్రభు ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. దయాపతి, ఉపాధ్యక్షులుగా శాలెం రాజ్, జాయింట్ సెక్రటరీగా అబ్రహం, కోశాధికారిగా హావిల్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా దేవకుమార్, ఎలిషా, ప్రచార కార్యదర్శులుగా వంశీరాజ్, విక్టర్ పాల్, ఆడిటర్లుగా దానియేలు రాజ్, పి. సాంసన్, ఫిలిప్పులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ మాజీ అధ్యక్షులు ఎలిషా, డివిజన్ అధ్యక్షులు ఎస్.డి. జాన్, మరియు కార్యదర్శి సొలోమోన్ రాజ్ పర్యవేక్షణలో నిర్వహించబడింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం యేకుల సామేలు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పాస్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి, పాస్టర్ల సంక్షేమానికి మరియు క్రైస్తవ సమాజ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. దైవకార్యాల్లోనూ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ మండలంలోని అన్ని చర్చిలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు గిరి, యాదయ్య, పౌలు, డానియల్ , రూబెన్, అబ్రహం, రవి కాంత్, బాలు, శ్రవణ్ కుమార్, యాదయ్య తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.