అమెరికాలో కొవీఢ్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా లక్షణాలతో కనెక్టికట్ రాష్ట్రంలో ఆరు వారాల శిశువు మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ బుధవారం వెల్లడించారు. శిశువు మరణంతో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో ఈ చిన్నారే అతి చిన్న వయస్కురాలుగా నమోదైనట్లు ఆయన తెలిపారు. శిశువు మరణంపై గవర్నర్‌నెడ్ లామోంట్ విచారం వ‍్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన.. గతవారం స్పందన కోల్పోయిన నవజాత శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చారని, మంగళవారం శిశువుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.