తేది:21-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: విద్య తోనే సమాజంలో గౌరవమని ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం డిజిటల్ ఫ్యానెల్స్ టీవీ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ తరగతులను నిర్వహించడం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు ఉపయోగముంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం కోసం నిరంతరం మనస్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు. రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులు బాగా చదవాలని కోరారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ తుకారం మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ కళాశాలకు 6.45 లక్షలు విలువగల డిజిటల్ ప్యానల్స్ ను ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా కళాశాలకు అందించడం జరిగిందని, దీని ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారని ఉచితంగా నేర్చుకునే అవకాశం ఉందన్నారు., ఫిజిక్స్ వాల, కానకాడమీ ల ద్వారా ఆన్లైన్ తరగతులను నీట్ ,జేఈఈ మెయిన్స్, తదితర పోటీ పరీక్షల కొరకు విద్యార్థులు సంసిద్ధం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కౌన్సిలర్ నరసింహారెడ్డి, అధ్యాపకులు శ్యామ్ రావు, రవికుమార్. శివకుమార్, దత్తు, శంకర్ ,స్రవంతి ,ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.