తేది:21-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్ న్.కే.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 2023లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం వర్ధన్నపేట 30 పడకల హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని జీవో నెంబర్ 445 ప్రకారం మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉన్న బిఆర్ఎస్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో శిలాఫలకం వేసి భూమి పూజ చేయడం జరిగింది.ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్ లో భాగంగా అట్టి పనులు ప్రారంభం కాలేదు ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇట్టి శిలాఫలకాన్ని తీసివేసి ఉప్పరపల్లి క్రాస్ దగ్గర ఉన్న అసైన్డ్ భూమిలో అట్టి హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని కేవలం సర్పంచులు గెలవాలనే ఆలోచనతో భూమి పూజ చేయడం జరిగింది, ప్రస్తుతం వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికలు రాగానే అక్కడ హాస్పిటల్ లేదు మళ్ళీ వర్ధన్నపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తానని మల్ల నిన్న భూమి పూజ చేయడం జరిగింది ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వర్ధన్నపేట ప్రజల పైన ఎలాంటి ప్రేమ లేదు ఆనడానికి నిలువెత్తు నిదర్శనం. నిన్న వర్ధన్నపేటలో జరిగిన 15 కోట్ల అభివృద్ధి పనులకు వరంగల్ జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు దానికంటే ముందు జరిగిన హస్పటల్ నిర్మాణానికి భూమి పూజకు కలెక్టర్ గారు పాల్గొనక పోవడం ఎమ్మెల్యే గారికి హాస్పిటల్ పై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం రాజకీయమే పరమవదిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు గారు,దయచేసి వర్ధన్నపేట నియోజకవర్గం నీకు రాజకీయ జన్మనిచ్చింది దీనిపైన చిత్తశుద్ధి ఉంటే వర్ధన్నపేట లో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్ ఎన్నికల ఇంచార్జ్ చింతల యాదగిరి, పోలపల్లి రామ్మూర్తి, సీనియర్ నాయకులు సిల్వర్ కుమార స్వామి, తుమ్మల యాకయ్య తోటకూర రాజమణి కొండేటి శ్రీనివాస్ ఆంగోత్ బిక్షపతి భూక్య రామన్న భూక్య గోర,బాలరాజ్ శ్రీనివాస్ కొండేటి సుధాకర్ జను రాములు ప్రభాకర్ కొండేటి సంపత్ పులి సత్యనారాయణ మొదలవారి పాల్గొన్నారు.