డబ్బా అమ్మక్కపేట గ్రామాల్లో నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో

తేది:21-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా : ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా, అమ్మక్కపేట గ్రామాల్లోని నర్సరీలను ఇబ్రహీంపట్నం ఎంపీడీవో గణేష్ పరిశీలించారు. డబ్బా గ్రామ నర్సరీలో మట్టి నింపే బ్యాగులు తక్కువగా ఉన్నట్లు గుర్తించి, వెంటనే పక్క గ్రామం నుంచి అవసరమైన బ్యాగులు తెప్పించుకోవాలని సూచించారు. అలాగే నర్సరీల్లో విత్తనాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.అనంతరం అంగన్వాడి కేంద్రాలను పరిశీలించారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణ ముందు ఎంపీడీవోను నూతన ఉపసర్పంచ్ రాపెళ్లి మహేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బైండ్ల విశాల్, కార్యదర్శి రవళి, కారోబార్ శ్రీనివాస్, వేణు, అరుణ్, రాజేందర్ మహిపాల్, శోభన్, రాజేష్, ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *