జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రూ.263.40 కోట్ల అంచనాతో 19 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

తేది:21- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా అన్ని వర్గాల అభివృద్ధికి మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు.
జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ శ్రీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారలతో కలిసి శ్రీకారం చుట్టారు. వీరితో పాటు ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్, ట్రైకార్ మరియు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ లు బెల్లయ్య నాయక్, తిరుపతి జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్, విజయ రమణ రావు, మక్కాన్ సింగ్ ఠాగూర్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, TSNPCDL CMD వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి రూ.200 కోట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి రూ.10 కోట్లు, ఎన్టీపీ ప్లాంటు (శుద్ధ త్రాగు నీటి కేంద్రం) నిర్మాణానికి రూ.17 కోట్లు, ఎస్సీ బాలుర వసతిగృహ నిర్మాణానికి రూ.2 కోట్లు మరియు మొత్తంగా 263.40 కోట్ల అంచనాతో 19 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు మాట్లాడుతూ:
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వపరంగా, శాఖ పరంగా, ఆర్థిక శాఖ పరంగా పనులకు అనుమతులు మంజూరు చేస్తే ధర్మపురి శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి పనులు జరుగుతాయని నా దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి గా నేను వాటిని వెంటనే ఆమోదం తెలిపామని అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో ఒక ఉమ్మడి కుటుంబం లాంటి
యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశాము.
ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో, ఇంటర్నెషనల్ స్థాయిలో ఏ రకంగా విద్యాభోదనలు, వసతులు కల్పిస్తున్నారో అదేవిదంగా యంగ్ ఇండియా ఇంటర్నెషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లలో అందిచబోతున్నట్లు తెలిపారు. ఒక్కో స్కూల్ కు 200 కోట్ల రూపాయలతో, దాదాపు 25 ఎకరాల్లో నిర్మించనున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి,బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు తెలియజేయునది ఏమనగా మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, మన తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు అని అన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఉన్నత చదువులు చదివితే అనేక ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారి మేధస్సును వినియోగిస్తారని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో మెదటి సంవత్సరమే 200 కోట్లతో 100 స్కూల్స్ కు అనుమతులు ఇచ్చామని తెలిపారు. 22,500 కోట్ల రూపాయలతో ప్రణాళికలురూపొందించి మొదటి సంవత్సరం 11500 శాంక్షన్ చేశామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ త్వరగాపనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతినెల బిల్లులు మంజూరు చేసే భాద్యత ప్రభుత్వానిదని తెలిపారు. ఇదే విషయాన్ని అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇదివరకే తెలిపామని అన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదవానికి ఉండడానికి ఒక గూడు లాగా ఉపయోగపడుతుంది. 5 లక్షల రూపాయలు ఇస్తే ఇండ్లు నిర్మించుకుని పేదవాడు ఆత్మగౌరవం తో నివసిస్తాడని అన్నారు. మెదటి సంవత్సరమే 4.50 వేల ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు.
అదేవిధంగా మహిళలందరు మహాలక్ష్మిలాగా చూస్తూ ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని తెలిపారు.
ఖర్చుతో కూడుకున్న కట్టుకోడానికి ఉపయోగ పడే విధంగా నాణ్యమైన చీరలను ప్రతి ఒక్క మహిళకు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధికి సంకల్పబద్ధంగా పని చేస్తోందన్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పిల్లలు చదువులో ముందుకు రావాలి, వారికి నాణ్యమైన వసతులు అందాలి అనే భావనతో ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించాం. ఒకే ప్రాంగణంలో విద్య, ఆటలు, హాస్టల్, ల్యాబ్స్, డైనింగ్, క్రీడలు అన్నీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పేద కుటుంబాల పిల్లలకు మంచి అవకాశాలు ఇస్తే వారు సమాజంలో పెద్దస్థాయికి ఎదుగుతారని మేము నమ్ముతున్నాం.
అలాగే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.10 కోట్లు మంజూరు చేశాం. ఈ కళాశాల దశాబ్దాలుగా తాత్కాలిక భవనాల్లో నడుస్తోంది. ఇప్పుడు శాశ్వత భవనం నిర్మాణంతో విద్యార్థులకు ప్రయోగశాలలు, లైబ్రరీ, ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
త్రాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా రూ.17 కోట్లతో ఎన్టీపీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. శుద్ధ నీరు అందితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఎస్సీ బాలుర వసతిగృహ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించాం. అనేక మంది విద్యార్థులు వసతి లేకపోవడం వల్ల చదువు ఆపాల్సి వస్తోంది. ఆ సమస్య ఇకుండదు. మంచి పఠన వాతావరణం లభిస్తుంది.
వెనుకబడిన వర్గాలు చదువులో, ఉద్యోగాల్లో, సమాజ నిర్మాణంలో ముందుకు రావాలంటే ప్రభుత్వం చేయాల్సిన పని మేము చేస్తున్నాం. అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణం కాదు, ప్రజల జీవితాలలో మార్పు రావడం.
జగిత్యాల జిల్లాకు అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిని దశలవారీగా పూర్తి చేస్తున్నాం. మరిన్ని పనులు కూడా త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాం.
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. ఎన్నికల సమయంలో చేసిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పారదర్శకత, నిబద్ధత, సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.
జగిత్యాల జిల్లాకు విద్య, వైద్యం , సంక్షేమ రంగాల్లో మంచి అవకాశాలు రావడానికి కొత్త ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం. యువతకు ఉద్యోగాలు, చదువు, నైపుణ్యాల పెంపుకై ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తాం.
ప్రజలు ఇచ్చిన ఆశీస్సులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మద్దతు ఉంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తాం. అందరికీ అభివృద్ధి అందించే సమాన అవకాశాల రాష్ట్రాన్ని నిర్మించడమే మా లక్ష్యం.”
ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ:
“రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. రైతులు బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుంది. రైతు కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర, సాగునీటి సదుపాయాల కల్పన, మార్కెట్ లింకేజీ అన్న అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో చూస్తోంది.
గతంలో రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంటల భీమా, పంటల నిల్వ, పంటల మార్కెటింగ్ వంటి అంశాల్లో ఆధునిక విధానాలు అమలు చేస్తున్నాం.
వ్యవసాయం మాత్రమే కాదు, గ్రామీణాభివృద్ధి కూడా తిరుగులేని ప్రాధాన్యం కలిగిన రంగం. గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, నీరు, రహదారులు మెరుగైందే రైతు కుటుంబాల భవిష్యత్తు కూడా మెరుగుపడుతుంది. అందుకే ఈ జిల్లాలో విద్య, త్రాగునీరు, సంక్షేమ రంగాల్లో భారీ మొత్తంలో నిర్మాణాలు చేపట్టాం.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి రూ.200 కోట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.10 కోట్లు, ఎన్టీపీ త్రాగునీటి ప్లాంట్‌కు రూ.17 కోట్లు, అలాగే ఎస్సీ బాలుర వసతిగృహానికి రూ.2 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు బలోపేతం అవుతున్నాయి.
విద్యతో పాటు నైపుణ్యాలు పెరిగితే రైతు కుటుంబాల పిల్లలు కొత్త రంగాల్లో ముందుకు సాగుతారు. వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అవుతారు. మా ప్రభుత్వం యువతకు నైపుణ్యాల పెంపును కూడా ముఖ్య ఆవశ్యకతగా చూస్తోంది.
రాష్ట్రంలో సాగునీరు అందించే ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాం. మైక్రో ఇర్రిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వ్యవసాయం లాభదాయకంగా మారే దిశగా మార్కెట్ వ్యవస్థలో కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నాం.
రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తోంది. రైతు ఆత్మగౌరవం పరిరక్షించడం మా ప్రభుత్వ లక్ష్యం. రైతు కుటుంబాల్లో ఎవ్వరూ వెనుకబడిపోకుండా రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఈ జిల్లాలో చేపట్టిన విద్యా, నీటి, సంక్షేమ నిర్మాణాలతో గ్రామీణ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రతి కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. గ్రామీణాభివృద్ధి అంటే రాష్ట్ర అభివృద్ధే. ఆ దిశగా మేము కట్టుబడి ఉన్నాం” అని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ:
సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. కేవలం పథకాలు ప్రకటించడం కాదు, ఆ పథకాలు లక్ష్యానికి చేరేలా కార్యాచరణ రూపొందించడం మా ప్రాధాన్యం. ప్రత్యేకంగా విద్యారంగంలో పేద, వెనుకబడిన, అగ్రహార ప్రాంతాల విద్యార్థులకు మంచి వాతావరణం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య ఉండాలి అంటే వసతి, ఆహారం, భద్రత, పఠన వాతావరణం అన్నీ ఉండాలి. అందుకే ఈ జిల్లాలో ఎస్సీ బాలుర వసతిగృహ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించాం.
వసతిగృహాలు నిర్మించడం ద్వారా అనేక మంది విద్యార్థులు నగరాలకు వలస వెళ్లే సమస్య తగ్గుతుంది. వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. చదువు మీద దృష్టి పెట్టే అవకాశం పెరుగుతుంది.
గ్రామాలు, మండలాలు, జిల్లాల పరిధిలో ఉన్న పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వసతి లభించడం అనేది సామాజిక న్యాయం దిశగా ఒక ముందడుగు. విద్య అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వసతి లేకపోవడం వల్ల వెనుకబడిన వర్గాలు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంది.ఇది ఒక్క వసతిగృహం మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా వసతిగృహాల నిర్మాణాన్ని దశలవారీగా చేపడుతున్నాం. విద్యార్థుల సంక్షేమం అంటే సామాజిక శక్తి పెరగడం. అదే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ జిల్లాలో చేపడుతున్న విద్య, నీరు, సంక్షేమ నిర్మాణాలు కలిసి గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ఇంటిగ్రేటెడ్ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఎన్టీపీ త్రాగునీటి కేంద్రం, వసతిగృహం – ఈ నాలుగు నిర్మాణాలు సమాజంలోని పలు వర్గాలకు లాభాన్ని అందించే విధంగా ఉన్నవి.
వెనుకబడిన వర్గాలు ఉద్యోగ రంగంలో, విద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ముందుకు రావడానికి ప్రభుత్వం వివిధ పథకాలు రూపొందిస్తోంది. అంకిత భావంతో పనిచేసే విద్యార్థులు అవకాశాన్ని పొందడానికి ప్రభుత్వం అడ్డుగా ఉండదు, నిలబడుతుంది.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృప, ధర్మపురి నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి 3 ప్యాక్స్ మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను కోరారు. అదేవిధంగా ధర్మపురి ని రెవిన్యూ డివిజన్, ట్రెజరీలను మంజూరు చేయాలని, వెనుగుమట్ల, దొంగతుర్తి లకు సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ను కోరగా వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా జిల్లా అభివృద్ధి మరియు నియోజకవర్గం అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం పట్టణాల అభివృద్ధి కాదు, గ్రామాలకు అభివృద్ధి రావడం. వెనుకబడిన వర్గం ముందుకు రావడం. విద్యార్థుల భవిష్యత్తు వెలిగిపోవడం.జగిత్యాల జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా సంబంధిత శాఖలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ:
సాగునీటి ప్రాజెక్టు లు అభివృద్ధి ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అలాగే మా వేములవాడ నియోజకవర్గంలోని మూడు మండలాలు జగిత్యాల జిల్లాలో ఉండడం మూడు మండలాలకు ముఖ్యమైన సుమారు 45000 ఎకరాలకు సాగునీరు అందించే కలికోట సూరారం ప్రాజెక్ట్ భూమి సేకరణ కు ఇప్పటివరకు 44 కోట్ల 50 లక్షల నిధులు మంజూరయ్యాయని మరో 34 కోట్లు రానున్నాయని తెలిపారు కథలాపూర్ మండలానికి సబ్స్టేషన్ మంజూరు చేసినందుకు ఉపముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి లాగే ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కి మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ:
ధర్మపురి అభివృద్ధికి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు మంగళవారం రోజున జగిత్యాల లో 235 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం మరియు మరియు క్రిటికల్ కేర్ భవనాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం మన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుపుకున్నామని తెలిపారు మరియు ధర్మపురి తో పాటు జగిత్యాలకు మంజూరైన యంగ్ ఇండియా స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి భూమి అలాట్మెంట్ త్వరలో జరుగుతుందని తెలిపారు జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్తు లైన్ల మార్పు విద్యుత్ స్తంభాల ఏర్పాటు సబ్స్టేషన్లో మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి గారికి కోరారు, జిల్లా ఇన్చార్జి మంత్రి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మరియు ఇంటిగ్రేటెడ్ స్కూలుకు తమ యొక్క పూర్తి సహకారం అందించాలని కోరారు. జగిత్యాల జిల్లాలో లక్ష్మీపూర్ లో ప్రారంభించిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు ఇప్పటివరకు కోటి 26 లక్షలు మంజూరు అయ్యాయని మరొక మూడున్నర కోట్లు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. తదనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ మరియు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల జంబో చెక్ అందించడం జరిగింది.
అలాగే వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
వీరితో పాటు ట్రైకార్ మరియు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ లు, బెల్లయ్య నాయక్, తిరుపతి, పెద్దపెల్లి, రామగుండం ఎమ్మెల్యే లు, విజయ రమణ రావు, మక్కాన్ సింగ్ ఠాగూర్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, TSNPCDL CMD వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, వివిధ స్థాయిల రాజకీయ ప్రతినిధులు, వివిధ స్థాయిల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *