తేది:21-01-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: BC, SC, ST- JAC రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ తలపెట్టిన ఒక లక్ష కిలోమీటర్ల ‘మా భూమి రథయాత్ర’ పేరిట చేపట్టిన పర్యటన బుధవారం మల్యాల మండల కేంద్రంలో కొనసాగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగే ఈ యాత్రలో భాగంగా గ్రామంలోని ప్రధాన సమస్య అయిన జగ్గని ఒర్రె గురించి స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి సమర్పించారు. అస్తవ్యస్తంగా మారిన ఈ ఓర్రెతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన ఒర్రె స్థితిగతులను పరిశీలించి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆయన వెంట జగిత్యాల జిల్లా ఇన్చార్జి దువ్వాక శివ, ఉపేంద్ర, మానాల కిషన్ తదితరులు ఉన్నారు.