తేది:21-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లను డబ్బా గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మీ మహేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, ఉప సర్పంచ్ రాపెళ్లి మహేష్, విడిసి చైర్మన్ జాన శంకర్, వార్డు మెంబర్స్ కనుక నాగరాజ్, ముద్దం నరేష్, బైండ్ల విశాల్, నేరెళ్ల సత్యం గౌడ్, దుద్దుల మహిపాల్, దేవిలాల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.