తేది 20-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్ NK.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట వంద పడకల ఆస్పత్రి నియోజకవర్గం లో నిర్మిస్తున్నామని చెప్పి గత రెండు నెలల క్రితం కట్ర్యాల గ్రామ శివారులోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద కల ప్రభుత్వ భూమిలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మళ్లీ దాన్ని వర్ధన్నపేట మండల కేంద్రంలో శంకుస్థాపన చేయడం చాలా విడురంగా ఉంది అని బిజెపి జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. వంద పడకల ఆసుపత్రిని కట్ర్యాల మరియు వర్ధన్నపేట లో నిర్మించడం ఎలా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గారిని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే నాగరాజు గారు ప్రయత్నం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కట్ర్యాల గ్రామ శివారులో శంకుస్థాపన చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది సఫలం కాకపోవడంతో ఇప్పుడు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో అక్కడి ప్రజల్ని మోసం చేసి గెలవాలనే విధానంతో కట్ర్యాల నుంచి వర్ధన్నపేటకు ఆసుపత్రినీ తరలిస్తున్నారని, ఈ మోసాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మహేందర్ రెడ్డి హితువు పలికారు. మూడు మండలాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి ఏ కారణం చేత వర్ధన్నపేటకు తరలిస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలని మహేందర్రెడ్డి ప్రజల తరఫున డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయని ఎమ్మెల్యే గారు చేసిన శంకుస్థాపనలు కూడా మరో స్థలానికి మార్చుతూ ప్రజల్ని మోసం చేయడం బాగా తెలుసుకున్నారని కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని మహేందర్ రెడ్డి అన్నారు. ఆస్పత్రి తరలి వెళ్తా ఉంటే కట్ర్యాల, కడారి గూడెం, ఉప్పరపల్లి, నల్లబెల్లి, కక్కిరాలపల్లి, పంతిని, చెన్నారం, వడ్లకొండ, చౌటపల్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు అప్పగించి చూస్తున్నారు తప్ప చేసేదేమీ లేక మొద్దు నిద్ర పోతూన్నారని మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. గతంలో శంకుస్థాపన చేసిన ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆసుపత్రి నిర్మాణం జరగకపోతే చుట్టుపక్క గ్రామాల ప్రజలను కలుపుకొని మేము కూడా ధర్నాలు చేసి బందులకు పిలుపునిచ్చి దాని సాధించుకునే విధంగా మూడు మండలాల ప్రజలను కలుపుకొని వెళ్తామని మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశంలో పేర్కొన్నారు.