తేది:20-01-2026 సంగారెడ్డి జిల్లా, ఝరాసంఘం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలంలోని బొప్పన్ పల్లి గ్రామం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రభుత్వం లో సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధిలో భాగంగా వీధిలైట్లు మరియు బోర్ మరమ్మత్తులు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన బోపన్ పల్లీ సర్పంచ్ గారు ఎంతో శ్రద్ధ చూపుతూ గ్రామం పట్ల పాడైపోయిన బోరు మోటర్లు కొత్త మోటర్లు తెచ్చి తెచ్చి వేయించడం జరిగింది. అభివృద్ధి లో ముందుకు సాగుతున్న బొప్పన్ పల్లీ సర్పంచ్ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో బాధలు తెలుసుకొని తక్షణమే దాని బాగు చేయడం జరిగింది కార్యక్రమం లో ఉపసర్పంచ్ గొల్ల రామయ్య మాజీ డిసిసి నెంబర్ సంజీవయ్య మ్యాతరి మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షకిల్ పార్టీ అధ్యక్షులు గొల్ల బాలయ్య ఫీల్డ్ అసిస్టెంట్ ఎం నవీన్ వార్డ్ మెంబర్ ముస్తాపురం ప్రవీణ్ గ్రామస్తులు విట్టాల్రెడ్డి షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.