ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీలో 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన- సత్తుపల్లి శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగమై దయానంద్.

తేది:20-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండలం రిపోర్టర్. మహమ్మద్ బురహానుద్దీన్.

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి పట్టణం మున్సిపాలిటీలో 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి మట్ట రాగ మైదయానంద్ శంకుస్థాపనాలు చేశారు. అదేవిధంగా సత్తుపల్లి పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ మసీదులో సత్తుపల్లి పట్టణం ముస్లిం పెద్దలు తో కలిసి సుమారు 5లక్షలతో షెడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సత్తుపల్లి పట్టణంలో బైపాస్ రోడ్ లో మరియు ముళ్ళ తీగల ఫ్యాక్టరీ వద్ద నూతన సిసి రోడ్డు నిర్మాణం కోసం 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్లను ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశా రు.పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ లో మరియు బైపాస్ రోడ్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం లబ్ధిదారులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్యులు తుమ్మల, పొంగు లేటి గా ర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆమె అన్నారు. అదేవిధంగా రానున్న మున్సిపల్ఎన్నికల్లో కూడా సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కావాల్సింది చేసుకుంటుందని మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలియజేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో కల్లూరు మున్సిపాలిటీలలో వర్గ విభేదాలు లేకుండా, కుల మతాలు తేడా లేకుండా అన్ని వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా తోడుగా ఉంటుందని, హిందూ ముస్లిం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని మనందరం కలిసి అభివృద్ధి సాధించుకుందామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *