రూ. 235 కోట్లతో ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తేది:20- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లాలో అందుబాటులోకి రానున్న అన్ని రకాల ఆధునిక వైద్య సేవలు. మెడికల్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్, మెడిసిన్ స్టోర్, 450 పడకల ఆస్పత్రి ఏర్పాటుతో మెడికల్ హబ్ గా మారనుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రూ. 235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల ఆస్పత్రి భవనాలకు మరియు క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ:
జిల్లా కేంద్రంలో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కళాశాల దగ్గర రూ. 235 కోట్లతో 450 పడకల ఆస్పత్రిని నిర్మించుకోబోతున్నామని అన్నారు. అలాగే రూ. 23.5 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్, రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజలతో పాటు చుట్టు పక్క జిల్లాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటుతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్రిటికల్ కేర్, నూతన ఆస్పత్రి జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో జిల్లా కేంద్రంలో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో డయాలసిస్, అత్యవసర ప్రసూతి శస్త్ర చికిత్సలు, మూడు ఆపరే షన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. జగిత్యాల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని, జగిత్యాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
రానున్న బడ్జెట్ సమావేశాల్లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేక మెడికల్ బిల్లు పెట్టేవిధంగా కృషి చేస్తానని తెలిపారు.
జిల్లా వైద్యశాలకు కావాల్సిన పరికరాలు, బడ్జెట్ పరంగా అన్నివిధాలా జిల్లా మంత్రి గా కృషి చేస్తానని తెలిపారు.
అన్నిరకాల వసతులు డాక్టర్లకు కావాల్సిన సౌకర్యాలు, ఫ్యాకల్టీ పరంగా, పరికరాల పరంగా, అన్నిరకాల సదుపాయాల గురించి రేపు రానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. జిల్లాలోని ప్రయివేట్ హాస్పిటల్స్ కు ధీటుగా మన జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో అన్నిరకాల వసతులు, పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం వైద్యులకి మాత్రమే ఉన్నదని జిల్లా ప్రాంత ప్రజలకు గొప్ప వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. జిల్లాలోని పేద ప్రజలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి జగిత్యాల ప్రాంతంలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆక్సిజన్ వెంటిలేటర్ ఇతర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
జిల్లా అభివృద్దికి వందల కోట్ల నిధుల మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి, మంత్రులకు జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ:
నాలుగు వైపుల రహదారి తో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 450పడకల ఆసుపత్రి జగిత్యాల లో నిర్మాణం మరియు క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభోత్సవం చేయటం జరిగిందని అన్నారు. తద్వారా రోడ్డు ప్రమాద,అత్యవసర ప్రసూతి బాధితులకు చాలా ఉపయోగం అని తెలిపారు. NMC గైడ్ లైన్ ప్రకారం మెడికల్ కాలేజీ కి150 పడకల ఆసుపత్రి ఉండాలని అన్నారు. 150పడకల ఆసుపత్రి ఉండడం తో 450 పడకల ఆసుపత్రి జగిత్యాల కు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి మంత్రులు కృషితో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేయడం జరిగిందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చొరవతో 40కోట్ల నిధులు మంజూరు తో మెడికల్ కాలేజీ పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని తెలిపారు.
మెడికల్ కళాశాల కు అవసరమైన వైద్యులు నర్సింగ్ స్టాఫ్ కు ప్రభుత్వం ద్వారా గతంలోనే అనుమతులు పొందడం జరిగిందని తెలిపారు. గుండె నరాలు ప్లాస్టిక్ సర్జరీ ఇలా సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని అన్నారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకుని జగిత్యాలకు అంబులెన్స్ ,MRI స్కాన్,వైద్య విద్యార్థులకు గ్రామాల్లో వైద్య సేవలు గాను3 బస్సు లు అవసరం ఉంటుంది అని మార్చురి వ్యాన్ కూడా అవసరం ఉందని వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రం లోనే అత్యధికంగా16 పల్లె దవాఖాన లు జగిత్యాలకు మంజూరు అయ్యాయని తెలిపారు. 5వేల ఇండ్లు కు ఒక బస్తీ దవాఖాన అవసరం ఉందని మంజూరు చేయాలనీ కోరారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వైద్యానికి కావలసిన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా మెడికల్ హాబ్ గా తయారైందని జిల్లా ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని జిల్లా ప్రజలు అందరు ప్రభుత్వం అందిస్తున్న అన్నిరకాల వైద్యసదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మెడికల్ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్, డి.ఎం.ఎచ్.వో సుజాత, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, ఆశ వర్కర్లు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *